నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామములో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను ఆలయకమిటి సభ్యులు మెుండ్ కార్ మల్లికార్జున్ ఘణంగా సన్మానించారు. ఈ సంధర్భంగా శుక్రవారం నాడు గ్రామములో గ్రామస్తులు సార్వజనికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ దేవత బంగారు లక్ష్మీ పూజలు నిర్వహణలో ముఖ్యఅథితిగా మాజీ ఎమ్మెల్యే షిండే పాల్గోన్నారు. నిర్వహకులు మహఅన్న దానం నిర్వహించారు. ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి గ్రామ బీఆర్ఎస్ నాయకులు షిండేతో పాటు విండోచైర్మేన్ శివానంద్, బస్వాపూర్ సర్పంచ్ రవిపటేల్, పడంపల్లి సర్పంచ్ గణుపటేల్, సీనీయర్ నాయకుడు నీలుపటేల్లను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ విండో చైర్మేన్ బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాద్యాక్షుడు రాజుపటేల్, గ్రామ సర్పంచ్, సీనీయర్ నాయకులు పావుడే బస్వంత్ పటేల్, లక్షెట్టి బస్వంత్, వీరభద్దర్, వాగ్మారే ప్రకాష్, తదితరులు పాల్గోన్నారు.