నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. మైదానం ఇంకా చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కాగా ఇవాళ ఉదయం నుంచీ వర్షం కురవకపోయినా మైదానం చిత్తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు ఇన్‌స్పెక్షన్ చేసి ఆట నిర్వహణకు అనువుగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.