పీసీసీ అధ్యక్షుడు ప్రమాణానికి మూడవ కల్లు డిపో కార్మికులు – కులస్తులు

నవతెలంగాణ కంఠేశ్వర్ : రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా నిజామాబాద్ నగరం నుండి మూడో కల్లు డిపోకు చెందిన గీతా కార్మికులు గౌడ కులస్తులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. జిల్లాకు, గౌడ కులానికి చెందిన మహేష్ గౌడ్ కి టీపీసీసీ అధ్యక్ష పదవి రావడం చాలా గర్వాంగా ఉంది. ఇది ఒక క్రమశిక్షణ నిబద్ధత కలిగిన వ్యక్తికి లభించిన గౌరవం అని చెప్పవచ్చు. ఈ హైదరాబాద్ కు తరిలివెళ్లిన నాయకులు రాజా గౌడ్, తిరుమలేశ్వర్ గౌడ్, ఏ శ్రీనివాస్ గౌడ్, గడ్డం లక్ష్మణ్ గౌడ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లలాగౌడ్, ఇదిగిరాల శ్రీనివాస్ గౌడ్, చిగురుపల్లి రాజ గౌడ్, రాజా గోపాల్ గౌడ్, సిరిగదా స్వామి గౌడ్, సూర్య ప్రకాష్ గౌడ్, బుర్ర రామ గౌడ్, జక్కపురం సాయగౌడ్, సుభాష్ గౌడ్, అశోక్ రాజ్ గౌడ్, పొన్నం శ్రీహరి గౌడ్, అధిపెళ్లి శంకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సురేష్ గౌడ్, మహేందర్ గౌడ్, రాజకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love