– కంట్లో కారం చల్లి కొట్టిన అగంతకులు
నవతెలంగాణ- మేడ్చల్
జవహర్ నగర్, ఆగస్టు 10 రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలుపవద్దన్నందుకు అకారణం గాదుండగులు పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడి కంట్లో కారం చల్లి దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… కార్పొరేషన్‌లోని బాలాజీనగర్ వెంకటేశ్వరకాలనీలో శివగల్ల దేవదాస్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. దేవదాస్ బుధవారం రాత్రి ఇంటికి వస్తున్నక్రమంలో దుండగులు అజయ్, గోపి, అతని కుటుంబసభ్యులు రోడ్డుకు అడ్డంగా వాహనాలునిలిపి మందు తాగుతూ దౌర్జన్యం చేశారు. ఉదయం మాట్లాడుకుందామని శివగల్ల దేవదాస్ (37)ఇంటికి వెళ్ళాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో దుండగులు అజయ్, అతని తండ్రి, మరోఇద్దరు ఇంటిపై దాడి చేసి ఇంట్లోకి ప్రవేశించి అసభ్య పదజాలంతో దూషించి, చంపుతానినబెదిరించి దేవదాస్ కంట్లో కారం చల్లి విచక్షణ రహితంగా కొట్టారు. దేవదాస్ తెరుకుని ఇంటినుంచి బయటకి వచ్చేలోపే దుండగులు ఐఫోన్‌ను ఎత్తుకుని పారిపోయారు. స్థానికులు వెంటనేపోలీసులకు సమచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.