ఆర్మీ జవాన్‌ వీపుపై పిఎఫ్‌ఐ అని రాసిన దుండగులు ..

నవతెలంగాణ -కొల్లాం :  ఓ ఆర్మీ జవాన్‌పై ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. గ్రీన్‌ ఇంక్‌తో అతని వీపుపై పిఎఫ్‌ఐ అని రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం తెలిపాయి. కేరళలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి.  ఆర్మీ జవాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. రబ్బరు అడవి పక్కనే ఉన్న తన ఇంటి సమీపంలో ఆరుగురు వ్యక్తులు దాడి చేసినట్లు ఆర్మీ జవాన్‌ షైన్‌ కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన చేతులను టేపుతో కట్టి.. వీపుపై పిఎఫ్‌ఐ అని రాశారని అన్నారు. కాగా, పిఎఫ్‌ఐ అనేది ఇస్లాంకి చెందిన నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా. అయితే ఈ ఘటనను పోలీస్‌ అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి వుంది.

Spread the love