పట్టాలపై నుంచి ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు..

నవతెలంగాణ -ఉత్తరప్రదేశ్‌:  ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి ఓ రైలు ఉన్నట్టుండి ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. అయితే, అప్పటికే ప్రయాణికులు ప్లాట్‌ఫాం వీడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మథుర స్టేషన్ డైరెక్టర్ ఎస్‌కే శ్రీవాస్తవ తేలిపిన వివరాలు ప్రకారం.. షుకుర్ బస్తీ నుంచి వచ్చిన ఈఎంయూ రైలు రాత్రి 10.49 గంటల సమయంలో మథుర స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత రైలు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం ఎక్కేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అంత ఎత్తున్న ప్లాట్‌ఫాంపైకి రైలు ఎలా ఎక్కిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన కొన్ని రైళ్లకు ఆటంకం ఏర్పడింది.

Spread the love