నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టులో నేడు విచారణ కూడా జరగనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసును నేడు సుప్రీంకోర్టు విచారించి తుది తీర్పు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్ను ఆదేశించాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసింది బీఆర్ఎస్  పార్టీ. ఇందులో భాగంగానే పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన 500 ఆధారాలను సుప్రీంకోర్టుకు అప్పగించింది. సుప్రీంకోర్టు ఎలాగైనా చర్యలు తీసుకుంటుందని ముందు జాగ్రత్తగా పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చింది ఈ తెలంగాణ అసెంబ్లీ. మరి నేడు సుప్రీంకోర్టు విచారణ చేసి ఎలాంటి తీర్పు ఇస్తుందో అని ఉత్కంఠత అందరిలోనూ ఉంది. ఒకవేళ పదిమంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే.. బీహార్ తో పాటు ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతాయి.

Spread the love