ప్రేమించుకున్నారు.. ఇద్దరు ఒక్కటయ్యారు..

నవతెలంగాణ – డిచ్ పల్లి

సిరికొండ మండలం లోని గడ్కోల్ గ్రామానికి చెందిన హరిని, ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన నిఖీల్ లు గత కొన్ని నెలలుగా ఒకరి నోకరు ప్రేమించుకున్నారు. మంగళవారం హరిని కుటుంబ సభ్యులు పోలిస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. దానిలో బాగంగా ఇరువురి కుంటుంట సబ్యులు పోలిస్ స్టేషన్ కు చేరుకుని చదువుకున్న సర్టిఫికెట్ లను ఎస్సై మనోజ్ కుమార్ కు చుయించారు. చదువు సర్టిఫికెట్ ఆధారంగానే ఇద్దరు పెళ్ళి వయస్సులో ఉన్నట్లు గుర్తించారు. హరిని కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా హరిని కి 4నేలలు తక్కువగా ఉన్నాయని తెలుపగా, చదువుకున్న సర్టిఫికెట్ లలో మాత్రం 18ఎళ్ళు దాటి నట్లు ఉండటం, కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పిన హరిని మాత్రం నిఖీల్ తోనే ఉంటానని, ఇప్పటికే తాము ఆలయంలో పెళ్లి చేసుకున్నామని, ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పారు. పోలిస్ స్టేషన్ లో సైతం ఇరువురు ప్రేమికులు పులదండలు మార్చుకున్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారు.. మళ్లీ ఒక్కటయ్యారు..అని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
Spread the love