నవతెలంగాణ – కంటేశ్వర్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకులు కొండ గంగాధర్ అంబేద్కర్ నగర్ లోని విగ్రహానికి పూలమాలతో బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దేశమ్ కులాలతో కులాల పునాదుల మీద ఆధారపడి ఉన్నది కుల పునాదుల మీద ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేము అని రాజ్యాంగ నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాల కోసం కులాన్ని అంటిపెట్టుకొని కులాల వారీగా విభజించి పరిపాలించడం నేటి పాలకుల దౌర్భాగ్యం కులాన్ని ఎదిరించి వివాహాలు చేసుకున్నటువంటి విద్యార్థులను కులదూరంకారంతోటి కాల్చి చంపిన సంఘటనలు వేముల ప్రశాంత్ రోజు ఇలాంటి మహా గొప్ప యువకులు విద్యార్థులు బలైనటువంటి పరిస్థితి గొప్ప కులం వారు చిన్న కులాలను భేదభావం తోటి చూడడమే జరుగుతున్నటువంటి విషయం అందరి సమానమే అది కేవలం ఉపన్యాసాల మట్టుకు మాత్రమే కానీ ఉన్నత కుల అగ్ర కులస్తులు మాత్రం నీచమైనటువంటి దుర్బుద్ధితో కులాలను పోషిస్తున్నారు. ఇది అంబేద్కర్ జయంతులు వర్ధంతిలు కేవలం దండలు వేసి మాత్రమే చేస్తున్నటువంటి పని కానీ అవి నివాళులు కావు దళితులకు మూడెకరాల భూమి కులాంతర వివాహాలు అందరికీ పని వంటి వాటిని మనము నిర్మించిననాడు అంబేద్కర్ కు ఘనమైన నివాళులు అర్పించిన కుల నిర్మూలన సమానత్వం ఆత్మగౌరవం వాటిని మనం పెంపొందించినాడు అలా కాకుండా అంబేద్కర్ సిద్ధాంతం గౌరవమే అంటూ కుల ప్రోత్సహించేటువంటి రాజకీయ నాయకుల చెంత చేరి వారికి వత్తాసు పలుకుతూ పోతున్నాము బ్రాహ్మణీయము క్యాపిటలిజము లాంటి సిద్ధాంతాలు మన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాయని ఆనాడే అంబేద్కర్ చెప్పాడు కానీ వాటి పక్కనే చేరి అసమానత్వాలను పెంపొందిస్తున్నాము కాబట్టి సమానత్వాన్ని పెంపొందించాలంటే అందరూ ఉన్నత చదువుల పైన దృష్టి సారించి వారి అభ్యున్నతి కొరకు ముందుండాలని తెలిపారు.