अपने ही संसदीय क्षेत्र में केंद्रीय मंत्री का भारी विरोध: हड़ताली ANM ने गिरिराज सिंह के काफिले को रोका, गाड़ी छोड़कर बाइक से भागे बीजेपी नेता#Bihar #Biharnews pic.twitter.com/oDZ4oAMfu2
— FirstBiharJharkhand (@firstbiharnews) August 4, 2024
నవతెలంగాణ-హైదరాబాద్ : శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెగుసరాయ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం తన సొంత నియోజకవర్గంలో నిరసన సెగ ఎదుర్కొన్నారు. డాక్ బంగ్లా రోడ్డు వద్ద బాలికల పాఠశాల సమీపంలో పార్కు శంకుస్థాపన కార్యక్రమం కోసం అక్కడకు చేరుకున్నారు. కాగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఏఎన్‌ఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గిరిరాజ్ సింగ్ కాన్వాయ్‌ను అడ్డుకుని వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుంచి దిగిన ఆయన ఒకరి బైక్ వెనుక కూర్చొన్నారు. నిరసనకారులను తప్పించుకుని బైక్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు నిరసన చేస్తున్న ఏఎన్‌ఎం కార్యకర్తలు ఇది చూసి షాక్ అయ్యారు. వారంతా పరుగున స్కూల్ వద్దకు వెళ్లారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అయితే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బైక్‌పై జారుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.