ఉపాధ్యాయ మహాధర్నాను విజయవంతం చేయాలి

– మహాధర్న పోస్టర్ ఆవిష్కరణ
– టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సుతారి పాపారావు
నవతెలంగాణ- తాడ్వాయి
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యా యుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ నెల 12న జిల్లాలో నిర్వహించే ర్యాలీలు, మహా ధర్నాను జయప్రదం చేయాలని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సుతారి పాపారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఉపాధ్యాయులతో కలిసి పోస్టర్ విష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యా యుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేశారు.  ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దుతో పాటు ఇతర ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు నియామకాలు చేపట్టాలన్నారు. పి ఆర్ సి కమిటీ వేయాలని కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జులై 1 నుంచి ఐ.ఆర్ ప్రకటించాలని, పండిట్ పి ఈ టి లను అప్ గ్రేట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నరేష్, రవీందర్, సర్కార్ యాదగిరి, రాకేష్, స్వామి, భూక్య బాబురావు, సాంబయ్య, పుల్లయ్య, బుర్ర రజిత, వెంకటలక్ష్మి, కవిత, సునావత్, బేగం తదితరులు పాల్గొన్నారు.
Spread the love