Watch: Drunk man abuses, kicks minor at a government school in Tamil Nadu’s Tiruchirappalli.
The man, now arrested, was identified as the father of another student studying at the school. #Viral #ViralVideo #TamilNadu pic.twitter.com/nKF3Uv5aTm
— Vani Mehrotra (@vani_mehrotra) October 19, 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం సేవించిన ఒక వ్యక్తి తన కుమార్తె కోసం ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లాడు. అతడి గురించి అడిగిన ఒక విద్యార్థి చెంపపై పలుమార్లు కొట్టాడు. ఆ బాలుడ్ని కాలుతో తన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విన్సెంట్ రాజ్ అనే వ్యక్తి మద్యం సేవించిన మత్తులో ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లాడు. కాగా, అక్కడ చదువుతున్న తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వెళ్లిన అతడ్ని ఎవరని ఒక విద్యార్థి అడిగాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆ విద్యార్థిపై దాడి చేశాడు. ఆ బాలుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అలాగే కాలితో తన్నాడు. ఇది చూసి మిగతా విద్యార్థులు భయంతో దూరంగా పారిపోయారు. అనంతరం ఆ వ్యక్తి తన కుమార్తెను ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు బాధిత విద్యార్థి తండ్రి దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విన్సెంట్ రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ వ్యక్తి విద్యార్థిని కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.