నవతెలంగాణ తొమ్మిదో వార్షికోత్సవ శుభ సందర్భంగా పత్రికా నిర్వహణ బందానికి శుభాకాంక్షలు, అభినందనలు. గొంతులేని ప్రజల గొంతుకగా తన అక్షర ప్రస్థానాన్ని అపూర్వంగా కొనసాగిస్తున్న ఈ పత్రిక నవతెలంగాణ. నేను, నా కలం అట్టడుగు, శ్రామిక వర్గాల అభ్యున్నతికే కషి చేశాయి. ముని మనవడు నాటకమైనా, ఊరబావి కథైనా, రంధినవలైనా, సాహిత్య విమర్శ అయినా, కవిత్వమైనా… సామాన్యుని జీవితాన్ని ప్రతిబింబించేవే. నేను అభ్యుదయ నవ సాహిత్యానికి కట్టుబడి ఉండటానికి నాటి ప్రజాశక్తి, నేటి నవ తెలంగాణ పత్రికలు నాకు నిత్యం ప్రేరణగా నిలిచాయి.
– ఇనాక్ కొలకలూరి