ఆళ్ళపల్లి మండలంలో ఓటింగ్ శాతం 89.57

– పురుషుల ఓటింగ్ 89.63
– మహిళల ఓటింగ్ శాతం 89.51గా నమోదు
– ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 8681 ఉండగా.. గురువారం జరిగిన పినపాక నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 9 పోలింగ్ కేంద్రాలు, 11 పోలింగ్ స్టేషన్ లలో కలిపి మొత్తం 7776 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దాంతో ఆళ్ళపల్లి మండలంలో పోలింగ్ శాతం 89.57గా నమోదైంది. పురుషులు మొత్తం 4372 మందికి 3919 మంది ఓటర్లు ఓటు వేశారు. దాంతో పురుషుల ఓటింగ్ 89.63 కాగా, మహిళలు మొత్తం 4309 మందికి 3857 మంది ఓటర్లు ఓటు వేసి 89.51 శాతం ఓటింగ్ నమోదు చేశారు. అలాగే
ఆళ్ళపల్లి మండలంలో పినపాక నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ వివరాలు ఎన్నికల ప్రత్యేక అధికారులు స్థానిక ఎంపీడీవో, ఎంపీఓ ఎం.రామారావు, బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు బూత్ ల వారిగా ఇలా ఉన్నాయి.. 11వ నెంబర్ రామాంజిగూడెం గ్రామం  పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఓట్లు 915 ఉండగా అందులో 400 మంది పురుషులు 414 మంది మహిళలు ఓటు వేశారు. మొత్తం ఓటు వేసిన వారు 814 మంది కాగా ఓటింగ్ శాతం సుమారు 88.96%.
16వ నెంబర్ అనంతోగు గ్రామం పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఓట్లు 667 ఉండగా 288 మంది పురుషులు, 306 మంది మహిళలు ఓటు వేశారు. మొత్తం ఓట్లు వేసిన వారు 594 మంది. 89% ఓట్లు పోల్ అయ్యాయి.
17వ నెంబర్ రాయిపాడు గ్రామం పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఓట్లు 571 ఉండగా పురుషులు 283 మంది, 242 మంది మహిళలు ఓటు వేశారు. మొత్తం 524 మంది ఓటర్లు ఓటు సద్వినియోగం చేసుకున్నారు. 91.7% ఓటింగ్ శాతం నమోదైంది.
18వ నెంబర్ ఆళ్ళపల్లి పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఓట్లు 1014 ఉండగా పురుషులు 466 మంది, మహిళలు 445 మంది ఓటర్లు ఓటు వేశారు. మొత్తం ఓటు వేసిన వారు 911 మంది కాగా, 89.84% శాతం ఓటింగ్ నమోదైంది.
19వ నెంబర్ ఆళ్ళపల్లి పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఓట్లు 1142 ఉండగా పురుషులు 511 మంది, మహిళలు 476 మంది ఓట్లు వేశారు. మొత్తం ఓట్లు వేసిన వారు 987 కాగా పోలింగ్ శాతం 86.42% గా నమోదైంది.
25వ నెంబర్ పెద్ద వెంకటాపురం గ్రామం పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఓట్లు 495 ఉండగా పురుషులు 234 మంది, మహిళలు 233 మంది ఓటు వేశారు. మొత్తం 467 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఓటింగ్ శాతం 94.34% గా నమోదైంది. ఆళ్ళపల్లి మండలంలో ఓటింగ్ శాతం అధికంగా నమోదైన పోలింగ్ కేంద్రంగా పెద్ద వెంకటాపురం 25 వ బూత్ నిలిచింది.
 20వ నెంబర్ మర్కోడు గ్రామం పోలింగ్ స్టేషన్ లో పురుషులు 657, మహిళలు 589 మంది మొత్తం 1246 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 524, మహిళలు 555, మొత్తం 1079 మంది ఓటర్లు ఓటు వేశారు. కాగా ఓటింగ్ శాతం 86.59గా నమోదైంది.
మర్కోడు గ్రామం పోలింగ్ స్టేషన్ 21లో పురుషులు 384, మహిళలు 378 మంది మొత్తం 762 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 345, మహిళలు 336 మంది ఓటర్లు ఓటు వేశారు. మొత్తం 681 మంది ఓట్లు వేశారు. కాగా పోలింగ్ శాతం 89.37గా నమోదైంది.
మర్కోడులోని 22వ పోలింగ్ స్టేషన్ లో పురుషులు 434, మహిళలు 411 మంది మొత్తం 845 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 398, మహిళలు 399 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 797 ఓట్లు పోల్ కాగా ఓటింగ్ శాతం 94.31గా నమోదైంది.
మర్కోడు గ్రామం పోలింగ్ స్టేషన్ 23లో పురుషులు 288, మహిళలు 251 మంది మొత్తం ఓట్లు 539 ఉండగా అందులో పురుషులు 270, మహిళలు 220 మంది ఓటర్లు ఓటు వేశారు. మొత్తం ఓట్లు 490 పోల్ కాగా ఓటింగ్ శాతం 90.90గా నమోదైంది.
మర్కోడు గ్రామం పోలింగ్ స్టేషన్ 24లో పురుషులు 238, మహిళలు 247 మంది కలిసి మొత్తం 486 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 210 మంది, మహిళలు 222 మంది ఓటర్లు ఓటు వేశారు. మొత్తం కలిపి 432 మంది ఓటర్లు ఓటు సద్వినియోగం చేసుకోగా ఓటింగ్ శాతం 89.07గా నమోదైంది.
ఆళ్ళపల్లి మండల వ్యాప్తంగా స్త్రీలు 4309 మంది ఓటర్లు ఉండగా అందులో 3857 మంది ఓటర్లు ఓటు వేశారు. కాగా వారి ఓటింగ్ శాతం సుమారు 89.51గా నమోదైంది. అలాగే మండల వ్యాప్తంగా పురుషులు 4372 మంది ఓటర్లు ఉండగా అందులో 3919 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంతో 89.63 శాతం ఓటింగ్ నమోదైంది. ఆళ్ళపల్లి మండలంలో స్త్రీపురుషుల మొత్తం ఓటింగ్ కలిపి 8681 మంది ఓటర్లు ఉండగా అందులో 7776 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో ఆళ్ళపల్లి మండలంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం సుమారు 89.57గా నమోదైంది.
ఇదిలా ఉంటే పీఎస్25 పెద్ద వెంకటాపురం పోలింగ్ స్టేషన్ కు ఓటు వేయడానికి బూసరాయి గ్రామం నుండి వచ్చిన మహిళ వరుసలో ఉండి స్పృహ తప్పి పడటంతో సకాలంలో స్థానిక వైద్యాధికారి అర్వపల్లి రేవంత్ ప్రథమ చికిత్స అందించగా ఆ మహిళ తిరిగి వచ్చి ఓటు వేసి వెళ్లడం జరిగింది. దాంతో పాటు రామాంజిగూడెం 11వ పోలింగ్ స్టేషన్ లో ఓటింగ్ యంత్రం మొరాయించడంతో ఉదయం పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే ఆళ్ళపల్లి 18వ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు నేరుగా వెళ్లడానికి పక్కనే సరైన గదులు ఉన్నప్పటికీ ఓటర్లకు ఇబ్బంది కలిగించేలా మెట్లు లేని మరో గదిని ఏర్పాటు చేయడంతో ఓటర్లు ఎక్కి దిగే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటు పలు పోలింగ్ స్టేషన్ లలో నెత్తి నడకన ఈవీఎంల పనితీరులో ఓటర్లు వరుసలో గంటల తరబడి నిలబడి ఓటు వేయాల్సి వచ్చింది. ఓటర్లకు ఆరోగ్య సమస్యలు, ఓటింగ్ సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, వైద్య, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మండలంలో పోలింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో సీఆర్ పీఎఫ్ బలగాలు, టీఎస్ ఎస్ పీ సిబ్బంది మొహరించి అసెంబ్లీ ఎన్నికలు ఆళ్ళపల్లి మండలంలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఎక్కడా ఘర్షణ వాతావరణం, నిర్లిప్తత లేకుండా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ తగిన చర్యలు, బందోబస్తు చేపట్టారు.
Spread the love