పార్కు గోడ కూలి ఇల్లు పాక్షికంగా ధ్వంసం..

– జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం 

– అటుగా చూడని వైనం సహాయ చర్యలు
– చేపట్టిన పోలీసులు..
నవ తెలంగాణ – బంజారా హిల్స్
అకాల వర్షానికి పార్కు గోడకూలి ఓ ఇల్లు ధ్వంసమైన సంఘటన బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని గౌరీ శంకర్ నగర్లో అకాల వర్షానికి బస్తీకి ఆనుకొని ఉన్న పార్కు ప్రహరీ గోడ కూలి మూడో ఇల్లు పాక్షికంగా ధ్వంసమై కూలిపోయింది.ఈ సంఘటనలో ప్రాణా నష్టం ఏమీ లేదు కొంత మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాగా  గోడ కూలిన సంఘటనలో జిహెచ్ఎంసి అధికారులు ఎవరూ అటువైపుగా రాకపోవడం సహాయక చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తపరించారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగితేనే వస్తారా అంటూ స్థానికులు జిహెచ్ఎంసి అధికారాలు తీరుపై ప్రశ్నిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ కి ఈ విషయం తెలియగానే వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి టిఆర్ఎస్ అధికారులకు ఫోన్లో సమాచారం తెలియజేసినట్లు కార్పొరేటర్ మాన్నే కవిత రెడ్డి తెలిపారు.
Spread the love