గుడ్ ఈవెనింగ్ పెట్టలేదని గూబ పగలగొట్టిన సంక్షేమ శాఖ అధికారిణి..

oplus_131072

– ఫోన్ చూస్తుందని విద్యార్థిని పై విచక్షణారహితంగా ప్రవర్తన..

నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్..
బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో చదువుతున్న ఓ విద్యార్థి నీ గుడ్ ఈవెనింగ్ పెట్టలేదని గుబబాలగొట్టిన సంఘటన సూర్యాపేటలోని వసతి గృహంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం సమయంలో బిసి సంక్షేమ శాఖ అధికారిణి అనసూయ హాస్టల్ విజిట్ కి వచ్చారు. ఆ సమయంలో విద్యార్థిని మొబైల్ ఫోన్ చూస్తూ అధికారిణి వచ్చింది గమనించకపోవడంతో నేను వచ్చిన నాకు నమస్కారం పెట్టవా నువ్వు అంటూ ఊగిపోయి జుట్టు పట్టుకొని విచక్షణ రైతంగా చితకబారింది. ఈ ఘటనపై విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం పారా మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బీసీ సంక్షేమ శాఖ అధికారి విచక్షణ రహితంగా కొట్టడంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వద్దని వారించారు. పక్కన రూమ్ లో ఉన్న వార్డెన్ వచ్చి అధికారిని అక్కడి నుండి పంపించారు. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.స్టూడెంట్ పై దాడి చేసిన బీసీ సంక్షేమ శాఖ అధికారిణి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Spread the love