కుటుంబమంతా హాయిగా నవ్వుకుంటారు

The whole family laughs comfortablyకథానాయకుడు రవితేజ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌లో వస్తున్న మరో కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీష్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో కార్తీక్‌ రత్నం మీడియాతో మాట్లాడుతూ, ‘ఇది హోల్‌ సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కామెడీ, థ్రిల్‌, యాక్షన్‌ అన్నీ ఉంటాయి. కుటుంబం అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూడదగ్గ చిత్రం. చాలా నవ్విస్తుంది. రంగురాళ్ళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఇందులో ఓ నాలుగు గ్యాంగ్‌లు ఉంటాయి. దాదాపు సినిమా అంతా గ్యాంగ్‌ల ఛేజింగ్‌, ఆ ఛేజింగ్‌లో కూడా కామెడీ ఉండటం ప్రత్యేకత. ఇందులో ఒక జర్మన్‌ షెఫర్డ్‌ డాగ్‌ ఉంటుంది. దానికి సునీల్‌ వాయిస్‌ ఇచ్చారు. అది ఈ పాత్రలపై ఎలాంటి ఇంపాక్ట్‌ చూపిస్తుంది అనేది కూడా బాగుంటుంది. దర్శకుడు సతీష్‌వర్మ ఈ కథ చెప్పినప్పుడు ఎంత థ్రిల్‌ అయ్యానో, ఈ సినిమాని రవితేజ నిర్మిస్తున్నారని చెప్పగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. రవితేజ సినిమా చూశారు. ఆయనకు చాలా బాగా నచ్చింది. నేను చేసిన బంగారురాజు పాత్రతోపాటు నాది వెరైటీ టైమింగ్‌ అని రవితేజ మెచ్చుకున్నారు. ప్రస్తుతం నేను చేసిన ‘శ్రీరంగనీతులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్‌రాజ్‌, ఎఎల్‌ విజరు కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నారు.

Spread the love