వింత పోటీ.. ఏం చేయకుండా ఖాళీగా ఉన్నవారే విజేతలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఈట్ ఫౌవ్ స్టార్.. డూ నథింగ్ అనే చాక్లేట్ యాడ్ మనం రోజూ టీవీల్లో చూస్తూనే ఉన్నాం.. అంటే దీని అర్ధం ఏం చేయకుండానే చాక్టేట్ తినండి అని.. సేమ్ అలాంటిదే.. ఏం చేయకండానే పోటీలో గెలుపొందండని సౌత్ కొరియా ఒక పోటీ నిర్వహిస్తోంది. అందులో ఏం చేయకుండ ఉన్నవాళ్ళే విజేతలు. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా.. అదే నిజం.  వివరాల్లోకి వెళ్తే.. సౌత్ కొరియాలో వూప్ స్యాంగ్ అనే విజువల్ ఆర్టిస్ట్ ” స్పేస్ ఔట్ ” పోటీని నిర్వహిస్తున్నారు. ఈ బీజీ లైఫ్ లో కాస్త విరామం అవసరమనేదే  ఈ పోటీ ముఖ్య ఉద్ధేశ్యం. దీనిలో భాగంగా పోటీ దారులు 90 నిమిషాలు ఏం చేయకుండా  ఖాళీగా ఉండాలి. వారి హార్ట్ రేటును పరీక్షించి, విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది నాలుగు వేల మందికి పైగా పాల్గొనగా..క్ర్వాన్-సో-ఏ అనే ఫ్రీలాన్స్ అనౌన్సర్ గెలుపొంది, ” ది థింకర్ ” అనే శిల్పాన్ని ట్రోఫిగా అందుకున్నారు.

Spread the love