విమానంలో పిండి కలిపిన మహిళ..

The woman who mixed flour in the plane..నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందివచ్చిన తర్వాత మహిళలు ఇంటి పనులు కూడా బస్సుల్లో చేసుకుంటున్నట్టు కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దీనికి మించిపోయే వీడియో ఒకటి  వైరల్ అవుతోంది. విమానంలో స్పెయిన్ వెళ్తున్న ఓ మహిళ విండో సీట్ పక్కన కూర్చుని ఏకంగా బ్రెడ్ పిండితయారుచేసింది. వ్లాగర్ అయిన ఆమె భూమికి కొన్ని వేల అడుగున ఎత్తున రొట్టె పిండి చేస్తున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న పాత్రలో తొలుత నీళ్లు వేసి ఆపై పిండి వేసింది. అందులో సరిపడా ఉప్పు వేసి చపాతి పిండిలా కలిపింది. దానిపై తడిగుడ్డ కప్పింది. కాసేపటికి పిండి మృదువుగా తయారైంది. ఆ తర్వాత రాత్రంతా ఉంచి పులియబెట్టాలని పేర్కొనడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే యూజర్లు కామెంట్లతో హోరెత్తించారు. విమానంలో అలాంటి పిచ్చిపనేంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించేందుకేనని మరికొందరు కామెంట్ చేశారు.

 

Spread the love