గుడుంబా తరలిస్తున్న మహిళ అరెస్ట్

నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థమైన గుడుంబా తరలిస్తున్న మహిళలను మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పసర ఎస్ఐఎ కమలాకర్ తెలిపారు. ఎస్ఐ కమలాకర్ కథనం ప్రకారం తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు పసర చౌరస్తాలో ఒక వ్యక్తి అనుమాస్పద స్థితిలో బ్యాగు పట్టుకుని అటు ఇటు తిరుగుతుండగా ఆమె దగ్గరికి వెళ్లి తనిఖీ చేయగా బ్యాగులో గుడుంబాతో పట్టుబడటం జరిగింది. నిందితురాలును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనదిన్నారు.
Spread the love