– చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి
– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 5న దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టనున్న ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ గురు వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐద్వా ఆధ్వ ర్యంలో జీపు జాతాను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి 9ఏండ్లు దాని గురించి పట్టించుకోకుండా.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున బిల్లును ముందుకు తెచ్చిందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కుల రక్షణకు భరోసా, భద్రత కల్పించాల న్నారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభు త్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శిం చారు. కేరళ, తమిళనాడు తరహాలో రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ పని దినాలు సంవత్సరానికి 200 రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ 125 గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా 2021లో 26046 మంది, 2022లో 31677 మంది లైంగికదా డులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, లైంగిక దాడులు పెరిగాయన్నారు. మహిళలకు ఆర్థిక, మానసిక పరిపుష్టి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మహిళా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు గద్దె దిగేవరకు పోరాడాలని పిలుపు నిచ్చారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకన పోయిన సైదమ్మ, నాయకులు జూలకంటి విజయలక్ష్మి, అండం నారాయణమ్మ, కోట సృజన, గోలి భాగ్యమ్మ, పిట్టల రాణి, గంగ పురి శశిరేఖ, చింత పద్మ, భాగ్యమ్మ, సుగుణమ్మ, శ్రామిక మహిళా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు కొప్పుల రజిత పాల్గొన్నారు.