ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు

– భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్:
ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పోరాట ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం దిగి వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుక వచ్చిందని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ పార్లమెంటు సభ్యురాలు గీతా ముఖర్జీ 1996 సెప్టెంబర్ 12 న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందని, అప్పటి నుండి నేటి వరకు 27 సంవత్సరాలుగా గీతా ముఖర్జీతో పాటు అనేకమంది మహిళా నేతలు దేశవ్యాప్తంగా తమ నిరసన గళాన్ని వినిపించడం జరుగుతున్నదన్నారు. అనేక సందర్భాల్లో మహిళా బిల్లు రాకుండా అడ్డుపడిన సందర్భాలున్నాయని, చివరకు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ ద్వారా కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. కోర్టు కూడా మహిళా బిల్లు విషయంలో సానుకూలత వ్యక్తం చేయడం జరిగిందని, అనేక మార్లు రెండు సభల్లో అనేక అడ్డంకులు ఎదుర్కొని నేడు ఆమోద ముద్ర పొందడం హర్షించ విషయం అన్నారు. ఈ విజయం పూర్తిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీకే దక్కుతుందని అన్నారు. హక్కుల సాధన కోసం మహిళ లు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాల్లు నేలవేణి స్వప్న, బండి అనసూర్య, పెద్ది నిర్మల, పొన్నాల స్వప్న,శనిగరపు స్వరూప పాల్గొన్నారు.
Spread the love