విద్యా ద్వారానే విజ్ఞానం, ప్రపంచం అభివృద్ధి

– ముత్తూట్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ తెలంగాణ,
– ఏపీ రాష్ట్రాల జోనల్‌ మేనేజర్‌ జితేందర్‌ కుమార్‌
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
విద్యా ద్వారానే విజ్ఞానం, విజ్ఞానం ద్వారానే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని ముత్తూట్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ తెలం గాణ, ఏపీ రాష్ట్రాల జోనల్‌ మేనేజర్‌ జితేందర్‌ కుమార్‌, హైదరాబాద్‌ సీఎస్‌ఆర్‌ మేనేజర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ గ్రూప్‌ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ జోన ల్‌ కార్యాలయంలో ఉన్నత విద్యావంతులైన ఏడుగురు నిరు పేద విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. తమ సంస్థ ద్వారా స్కాలర్‌ షిప్‌లు పొంది ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సమాజాభివద్ధికి పాటు పడాలని వారు కోరారు. మెడికల్‌, ఇంజనీరింగ్‌, బీఎస్సీ, నర్సింగ్‌ కోర్సులు చదివే విద్యార్థులకు వారు స్కాలర్‌ షిప్‌ చెక్కులు అందజేశారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు వి.శ్రీలక్ష్మి, దీపిక, అజ్మా, కౌశిక్‌ సింగ్‌ లకు రూ.2,40,000, బీటెక్‌ విద్యార్థులు స్నేహిత, చరణ్‌, పెట్టెం ఆదర్శణిలకు రూ.1,20,000ల స్కాలర్‌ షిప్‌ చెక్కులను వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో హిమాయత్‌ నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ జి.మహాలక్ష్మి రామన్‌ గౌడ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ సైబరాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ కె.వి.మురళీ, సికింద్రాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ గోలీ రోజా తదితరులు పాల్గొన్నారు.

Spread the love