– కనుగొన్న శాస్త్రవేత్తలు
సిడ్నీ : పసిఫిక్‌లోని సోలమన్ దీవుల సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పగడం కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వారు కనుగొన్న కొత్త ఆవిష్కరణ వివరాలను గురువారం వెల్లడించారు. ఈ పగడం దాదాపు 300 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది పగడపు దిబ్బకంటే భిన్నంగా ఉంది. విభిన్నమైన పగడపు కాలనీల నుండి ఇది కొత్తగా తయారుచేసినట్లుగా ఉందని సముద్ర పర్యావరణ శాస్త్రవేత్త ఎన్రిక్ సాలా అన్నారు. ఇది 34 మీటర్ల వెడల్పు (111 అడుగులు), 32 మీటర్ల పొడవు (104 అడుగులు) అని పేర్కొన్నారు. అమెరికన్ సమావాలో కనుగొన్న ‘బిగ్ మొమ్మా’ కంటే మూడు రెట్లు పెద్దదని తెలిపారు.