దారుణం..రెండేళ్ల చిన్నారిని ఈడ్చికెళ్లి కరిచి చంపిన కుక్కలు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం కలకలం రేపింది. పెనుగ్రంచి ప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. బాలుడిని పొలాల్లోకి ఈడ్చుకెళ్లి కరిచి చంపేశాయి. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ బాలుడి మృతికి మున్సిపల్ సిబ్బందే కారణమని ఆరోపిస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బాలుడిని మున్సిపల్ సిబ్బందే పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love