దారుణం.. నిద్రలో ఉండగా నిప్పంటించిన తండ్రి

నవతెలంగాణ – కేరళ: కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి రాత్రి నిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు.  వివరాలోకి వెత్తే.. నిందితుడు  బుధవారం అర్ధరాత్రి తన కుమారుడు జోజీ, కోడలు లిజీ, మనవడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో జోజీ, అతడి కుమారుడు మృతిచెందారు. 50 శాతం కాలిన గాయాలతో లిజీ ఎర్నాకుళంలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది కుమారుడి కుటుంబానికి నిప్పంటించిన తర్వాత నిందితుడు జాన్సన్‌ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణంగా తెలుస్తోందని చెప్పారు.

Spread the love