దారుణం.. న్యాయ‌వాదిని కాల్చిచంపిన దుండ‌గుడు

నవతెలంగాణ- ల‌క్నో: యూపీలోని ఘ‌జియాబాద్‌లో న్యాయ‌వాదిని ప‌ట్ట‌ప‌గ‌లు దుండగుడు కాల్చిచంపాడు. ఈ రోజు మ‌ధ్యాహ్నం న్యాయ‌వాది ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తి నేరుగా ఆయ‌నపై కాల్పులు జ‌రిపాడు. మృతుడిని న‌గ‌రానికి చెందిన లాయ‌ర్ మ‌నోజ్ చౌధ‌రిగా గుర్తించారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌నోజ్ భోజ‌నం చేస్తున్నారు.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. నిందితుడిని ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని పోలీసులు చెప్పారు.

Spread the love