దారుణం..బురదలో ముంచి చిన్నారిని చంపేసిన మేనమామ

నవతెలంగాణ-హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని మేనమామ అతి కిరాతంగా చంపేశాడు. బురద నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. కుటుంబ కలహాలతోనే మేనమామ శ్రీనివాస్‌ ఇంతటి ఘాతుకానికి తెగించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, కొంతకాలంగా శ్రీనివాస్‌కు మతిస్థిమితం లేదని కూడా స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love