జగిత్యాలలో దారుణం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు

నవతెలంగాణ – జగిత్యాల: తెలంగాణ జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ అతి దారుణంగా రోకలితో కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట ఒంటరిగా నిద్రిస్తున్న తిరుపతిపై తమ్ముడు శ్రీనివాస్ రోకలిబండతో దాడి చేసినట్లు తెలుస్తుంది. తలకు బలమైన గాయం కావడంతో తిరుపతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై బుగ్గారం పోలీసులు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రక్తం పంచుకున్న అన్నదమ్ములు ఇలా ఆస్తి కోసం ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం.. అందరిని కలచివేస్తుంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు..

Spread the love