ప్రధాని పేరు తెలియదన్నాడని వరుడికి షాకిచ్చిన యువతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన పెండ్లిని కాదని.. పెళ్లికొడుకు తమ్ముడిని ఓ యువతి వివాహం చేసుకుంది. వరుడు.. దేశ ప్రధాని పేరు చెప్పలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. శివశంకర్‌ (27)కు జూన్‌ 11న రంజనతో వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. జూన్‌ 12న ఉదయం.. పెండ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరని మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేకపోయాడు. ఇది చూసిన వధువు బంధువులు అతణ్ని హేళన చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన వధువు.. శివశంకర్‌ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెండ్లి చేసుకుంది. రంజన కంటే అనంత్‌ వయసులో చిన్నవాడు.

Spread the love