మాంజాతో తెగిన యువకుడి గొంతు..

నవతెలంగాణ – నవీపేట్: మండల కేంద్రంలో చైనా మాంజాతో సుభాష్ నగర్ కు చెందిన అద్నాన్ (18) యువకుడి గొంతు మంగళవారం తెగింది. మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియా ప్రాంతంలో చైనా మాంజాతో ఉన్న పతంగ్ తెగిపోవడంతో పట్టుకునేందుకు ప్రయత్నించిన అద్నాన్ మెడకు చుట్టుకుంది. మెడకు చుట్టుకొని గొంతును కత్తిరించగా తీసేందుకు చేతితో ప్రయత్నించగా కుడి చేతి వేళ్ళు సైతం తెగాయి. దీంతో స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా గొంతుకు నాలుగు, చేతి వేళ్లకు నాలుగు కుట్లు పడ్డాయి. చైనా మాంజ యువకుడి ప్రాణం మీదికి వచ్చినట్లయితే. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
Spread the love