టీషర్టు కోసం అన్నను చంపిన తమ్ముడు

నవతెలంగాణ – ఆంధ్రప్రదేశ్: టీ షర్ట్‌ కోసం ప్రాణాలను కోల్పోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్‌ (31), సురేశ్‌ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్‌ టీ షర్ట్‌ను సురేశ్‌ ధరించాడు. దీంతో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో అన్న రమేశ్‌ను తమ్ముడు సురేశ్‌ నెట్టివేయడంతో తలకు రాయి తగిలింది. తీవ్ర గాయం కావడంతో స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love