నవతెలంగాణ – తమిళనాడు: తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఒండిపుత్తూరు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు మార్గం మధ్యలో గుంతలు తీశారు. దాని పక్కనే రోడ్డుపై నుంచి వెళ్లే క్రమంలో ముగ్గురు యువకులు బైకుపై వెళ్తూ ప్రమావదశాత్తు అదుపు తప్పి గుంతలో పడిపోయారు. ఈ ఘటనలో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాటసారులు వారిని క్షేమంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.