యువత అర్ధరాత్రి సమయంలో అనవసరంగా రోడ్డుమీద తిరగరాదు

– పట్టణ సీఐ నరహరి

నవతెలంగాణ-కంటేశ్వర్ : యువత అర్ధరాత్రి సమయంలో అనవసరంగా రోడ్లమీద తిరగరాదని పట్టణ సిఐ నరహరి తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ జయరాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యం లో నిజమాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి, టాస్కఫోర్స్ సిఐ అంజయ్య  స్పెషల్ పార్టీ సిబ్బంది నిజామాబాద్ పట్టణంలో అర్దరాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై ద్విచక్ర వాహనాలతో ఒక్కొక్క బండి మీద ముగ్గురు చొప్పున తిరుగుతున్న 66 మంది యువకులను వారి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఈ సందర్భంగా పట్టణ సీఐ నరహరి మాట్లాడుతూ రాత్రి సమయంలో విచ్చలవిడిగా యువకులు ఒక్కొక్క బండిమీద ముగ్గురు చొప్పున తిరుగుతూ నిజామాబాద్ పట్టణంలో అర్ధరాత్రి వేళ మద్యం సేవించి విపరీతమైన వేగంతో ద్విచక్ర వాహనాలను నడపడం వలన అదుపుతప్పి ప్రమాదవశత్తు ప్రాణాలు కోల్పోతున్నారు కావున ఇటీవల నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి సత్యనారాయణ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చాలని గంజాయి, మట్కా, పేకాట , లాంటివి ఉండకుండా అదుపు చేయాలని ఉద్దేశంతో పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, నేర ప్రవర్తన కలిగినటువంటి పాత నేరస్తులు వారి యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండే విధంగా ఎటువంటి నేరంలలో పాల్గొనకుండా ఉండాలని ఉద్దేశంతో రాత్రి పగలు తేడా లేకుండా వాహన తనిఖీలు  కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాములు నిర్వహించమని చెప్పారు. అదేవిధంగా అర్థరాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై ద్విచక్ర వాహనాలతో విపరీత వేగంతో తిరుగుతున్నటువంటి యువకుల వల్ల దొంగలు  సాధారణ పౌరులను గుర్తించడం కష్ట సాధ్యం అవుతుంది కావున ఎవరు కూడా అర్ధరాత్రి సమయంలో అనవసరంగా రోడ్డుపైన తిరగకూడదని ఒకవేళ ఎవరైనా ఆ విధంగా పోలీసు యొక్క సూచనలను పాటించకుండా తిరిగినట్టయితే తదుపరి నుంచి వాహనాలను సీజ్ చేయడంతో పాటుగా కేసులు నమోదు చేసి కోర్టు యందు హాజరు పరుస్తామని నిన్న రాత్రి సోమవారం పట్టుబడిన యువకులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మంగళవారం నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ యందు నిజామాబాద్ పట్టణ సీఐ నరహరి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ నాలుగో పట్టణ ఎస్సై సంజీవ్ మరియు వారి సిబ్బంది రమేష్, అనిల్, భూరాజ్, రమేష్, రాకేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
Spread the love