– పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుంది..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
– ఆదర్శ క్లబ్ నూతన భవనం ప్రారంభించిన ప్రభుత్వ విప్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పేదలకు అన్యాయం జరిగితే వారి సమస్యలపై ప్రశ్నించేందుకు యువత ఎప్పుడు ముందుండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ క్లబ్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ముందుగా వివేకానంద విగ్రహానికి ఆది,కే కే,గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ … యువత పెడదారిన పట్టకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన వివరించారు. గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని దానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాలుపంచుకోవాలన్నారు. గ్రామాల్లో యువత గంజాయి,మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆయా గ్రామాల్లోని యూత్ క్లబ్ లు బాధ్యతగా వ్యవహరించాలని. ఎక్కడ తప్పు జరిగిన, ఎక్కడ పొరపాట్లు జరిగిన నిలదీయడంలో వెనకడుగు వేయవద్దని యువతకు సూచించారు.పేదవాళ్లకు చెందవలసిన ప్రభుత్వ భూమి తంగళ్ళపల్లి మండలంలో ఎక్కువగా ఆక్రమణకు గురైందన్నారు.చట్టాలను తుంగలో తొక్కి అందిన కాడికి దోచుకున్నారన్నారు.కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోని,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింగం గౌడ్, ఆదర్శ యూత్ క్లబ్ అధ్యక్షులు బత్తిని మల్లేశం, ప్రధాన కార్యదర్శి మోర శ్రీకాంత్, కోశాధికారి కోడం శ్రీధర్, మ్యాన నాగరాజు, సిరిపురం రమేష్, మోర రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు..