నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోజురోజుకు ఆకతాయిలా అల్లర్లు మితిమీరి పెంచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నగరంలోని ఖలీల్ వాడిలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న దంపతులపై డమ్మీ తుపాకీ చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఆపై నవ్వుతూ వికృత చేష్టలకు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను వెనుకాల మరో వాహనం వై వచ్చిన ముగ్గురు పోకిరీలు నకిలీ తుపాకితో భయపడడంతో ఆ దంపతులు బిత్తర పోయారు. ఈ ఘటనతో వారు ఆందోళన చెందారు. బైక్ పై నుంచి దిగిన దంపతులు యువకులను ఈ విషయంలో నిలదీయడంతో అక్కడ కొట్లాటకు దిగడం జరిగింది అని స్థానికులు తెలుపుతున్నారు. వారి ప్రవర్తనను బట్టి ఏమి చేయాలో స్థానికులకు అర్థం కాక స్థానికులు డయల్ 100 కు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులను బాధిత దంపతులు, స్థానికులు ఆశ్రయించారు. ఈ ఘటనకు పాల్పడిన హైమద్ పుర కాలనికి చెందిన ఆద్నాన్, సమీర్, కరీం అనే ముగ్గురు ఆకతాయిలను ఒకటో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిజామాబాద్ టేనగరంలో డమ్మీ తుపాకీలతో సోషల్ మీడియాలో బెదిరింపులు, బర్త్ డేలు చేయడం సర్వ సాధారణంగా మారింది. గతంలో మాజీ రౌడీషీటర్ ఆరిఫ్ డాన్ సోషల్ మీడియాలో డమ్మీ తుపాకీలతో విన్యాసాలు చేయగా అప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఖలీల్వాడిలో డమ్మీ తుపాకీ వ్యవహారం కలకలం రేపుతోంది. భార్యాభర్తల ను ఓ వర్గానికి చెందిన యువకులు కావాలని వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలియజేశారు.