గూడూరు శివాలయంలో చోరీ

– హుండీలు ఎత్తుకెళ్లిన దొంగలు

– సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఉండొచ్చని అంచనా
– ఆధారాలు సేకరించిన క్లూస్ టీం
నవతెలంగాణ –  కొత్తూరు
శివాలయంలో దొంగలు పడి హుండీలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన మండలంలోని గూడూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ పూజారి ఆదివారం సాయంత్రం గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో దొంగలు ఆలయంలోకి చొరబడి గర్భగుడి తాలాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న వస్తువులను ఏ ఒక్కటి కూడా తీసుకుపోలేదు. గర్భగుడి ముందున్నటువంటి రెండు హుండీలపై వారి కన్ను పడింది. అక్కడే వాటిని పగలగొట్టి డబ్బులు తీసుకెళ్తే శబ్దం వచ్చి గ్రామస్తులు వచ్చే అవకాశం ఉందని వారు ఏకంగా వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయారు. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద వాటిని పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను తీసుకొని ఖాళీ హుండీ డబ్బాలను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఉదయం పొలానికి తన చేరుకున్న రైతు వాటిని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో సిఐ నరసింహారావు ఎస్సై జి శ్రీనివాసులు ఏ ఎస్ ఐ అబ్దుల్లా తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని దేవాలయం నికి తెప్పించారు. క్లూస్ టీం కు సమాచారమేవగా వారు ఎక్కడికి చేరుకొని వేలిముద్రలను ఆధారాలను సేకరించారు. విచారణలో భాగంగా ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఓ మహిళ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులను గమనించినట్లు చెప్పారు. చీకట్లో వారిని సరిగ్గా గుర్తించలేదని ఆమె తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ దయానంద్ గుప్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Spread the love