‘మేడ్చల్‌ నగల దుకాణంలో చోరీ’ నిందితుల అరెస్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: పట్టపగలు నగల దుకాణంలో చొరబడి దోపిడీకి యత్నించిను నిందితులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కమిషనరేట్‌లో సీపీ అవినాశ్‌ మహంతి మేడ్చ ల్‌ డీసీపీ కోటిరెడ్డితో కలిసి కేసు వివరాలను వె ల్లడించారు. ఈ నెల 20న దుండగులు మేడ్చల్‌లోని జగదాంబ జువెలరీ షాపులోకి వచ్చారు.  యజమానిపై కత్తితో దాడిచేయగా, హెల్మెట్‌ ధరించిన దుండగుడు దోపిడీకి యత్నించాడు. యజమాని కుమారుడు అరవగా దుండగులు పారిపోయారు. పోలీసులు 16 ప్రత్యేక బృం దాలతో దర్యాప్తు చేపట్టాయి. నిందితులు నజీమ్‌ అజీజ్‌ కొటాడియా, సోహెల్‌, సల్మాన్‌గా గుర్తించారు. శనివారం నాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద నజీమ్‌, సోహెల్‌ను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న సల్మాన్‌ కోసం గాలిస్తున్నారు.

Spread the love