నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగిందని నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పాండేరావు తెలిపారు. నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పాండేరావు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు. ఇంటి యజమాని వెంకటి తన భార్యతో కలిసి శనివారం సాయంత్రం వేములవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం పనిమనిషి దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చింది. నాలుగో టౌన్ ఎస్సై పాండేరావ్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. వివరాలు పూర్తిగా తెలియలేవని కుటుంబీకులు వచ్చాక మిగతా వివరాలను వెల్లడిస్తామన్నారు.