– ప్రమాదాల బారిన వాహనదారులు పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-శంషాబాద్
గుంతలను తప్పించబోయి ప్రమాదానికి గురై వ్యక్తి మరణించాడు లేదా తీవ్ర గాయాలయ్యాయి అంటూ విషా ద ఘటనలు రోజూ చూస్తున్నాం. చిన్న గుంతనే కదా ఏమై తదనుకుంటే ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. మొన్న మల్కా రం గ్రామానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి తాను నిత్యం ప్రయాణించే మల్కారం-కావేలిగూడ షాబాద్ రహదారిపై ప్రమాదానికి గురై మరణించాడు. అతని మరణానికి కార ణం ఆ రోడ్డుపై ఏర్పడిన గుంతనే. ఆ గుంతను తప్పించబో యి అతను ద్విచక్ర వాహనంతో కిందపడి మరణించాడు. ఇలాంటి ఘటనలు శంషాబాద్‌లో నిత్యకృత్యంగా మారా యి. శంషాబాద్‌లో ఆరు నెలల క్రితం అవుటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ కనిపించక ప్రమాదానికి గురై ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధిలోని ఇందిరానగర్ దొడ్డి వద్ద ఏర్పడిన గుంత ల కారణంగా మండల పరిధిలోని చౌదరిగూడకు చెందిన ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. శంషాబాద్ జాతీయ రహ దారి 44 తొండుపల్లి నుంచి పాలమాకుల వరకు అక్కడ క్కడ రోడ్డుపైన గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలు తప్పిం చి వాహనం నడిపే క్రమంలో చాలామంది వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధి లోని తొండుపల్లి వద్ద చాలాచోట్ల గుంతలు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
సాధారణంగా రోడ్డుపై కుక్కలు, పందులు, పశువులు, చిన్నపిల్లలు, మూలమలుపుల కారణంగా వాహనాలు ప్ర మాదానికి గురి కావడం సహజమే. అయితే వీటి కంటే కూడా రోడ్డుపైన ఏర్పడిన గుంతలను తప్పించబోయి జరు గుతున్న ప్రమాదాలే అధికం. శంషాబాద్ జాతీయ రహదారి తర్వాత అత్యంత రద్దీగా ఉండే షాబాద్-శంషాబాద్ ప్రధాన రహదారి ఇసుక మేటలు గుంతలతో, దుబ్బతో, దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నది. శంషాబాద్ అంబేద్కర్ చౌర స్తా నుంచి రాల్లగూడ వరకు ఉన్న రోడ్డుపై నిత్యం ప్రమా దాలు జరుగుతున్నాయి. రాల్లగూడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇంద్రానగర్ దొడ్డి వరకు అక్కడక్కడ పెద్ద చిన్న గుంతలు స్పీడ్ బ్రేకర్లు వల్ల నిత్యం ప్రమాదాలు సాధారణం. ఇంద్రానగర్‌దొడ్డి-కవ్వ గూడ చౌరస్తా వద్ద భగీరథ పైపుల కోసం తవ్విన గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నా యి. మండలం నర్కూడ-షాబాద్ రహదారి పానాది వద్ద ఏర్పడిన గుంతలతో ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేక ఉన్నాయి. నర్కూడలోని మీ-సేవా కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు రోడ్డు అస్తవ్యస్తంగా తయారయింది. దీం తో ఇక్కడ ప్రయాణికులు జారి పడటం లేదా వాహనాలు గుద్దుకోవడం తరచుగా జరుగుతున్నది. మల్కారం ముఖ ద్వారం దగ్గర ఏర్పడిన గుంతలు దగ్గరికి వచ్చే వరకు కని పించక ప్రమాదాలు జరుగుతున్నాయి.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు ప్ర యాణికులు పెద్ద ఎత్తున ప్రమాదాలకు జరుగుతున్నా సర్పంచులు, ఆర్‌అండ్‌బి అధికారులు ఏలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఘటన జరిగినప్పుడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పంచనామ నిర్వహించి కేసు రాసి వది లేస్తున్నారు. చిన్న గుంతనే కదా అని వదిలేయడం వల్ల రా త్రిపూట ఈ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
చిన్న చిన్న గుంతలతో ప్రాణాలు పోవడం లేదా అంగ వైకల్యంతో కుటుంబాలు చిన్నా భిన్నం అవుతున్నాయి. విష యం పై అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ప్రజ లు కోరుతున్నారు. వర్షాకాలంలో ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉన్నందున సంబంధిత ఆర్ అండ్ బి అధికారు లు గ్రామపంచాయతీ పాలకవర్గం, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్లు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.