స్వపరిపాలనలో ఎన్నో ఒడిదుడుకులు

– విశ్వనగరంగా హైదరాబాద్‌ అడుగులు
– అభివృద్ధిలో భేష్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రత్యేక తెలంగాణలో ఎన్నో ఒడుదుడుకుడుల మధ్య గణనీయమైన అభివృద్ధిని సాధించాం. సుపరిపాలన ద్వారా హైదరాబాద్‌ నగరం ఉపాధి, ప్రజా రవాణా, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమ స్థాపన, రియల్‌ ఎస్టేట్‌ ఆశించిన స్థాయి కంటే పెరగడం ఒక ఎత్తైతే శాంతి భద్రతల మూలంగా హైదరాబాద్‌ నగరం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మునిసిపల్‌, పట్టణాభివద్ధి, ఐటి పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్‌ ముందుచూపుతో గణనీయమైన ప్రగతి సాధించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యతను ఇవ్వటమే కాకుండా 100ఏండ్లకు సరిపడే నీళ్ల సదుపాయాలు, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతా ల కాలనీ లకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేశారు. నగర వాసుల సహాయక సహకారాలు, అధికారుల సమన్వ యంతో జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో విశ్వ నగరానికి బాటలు వేసింది.
ఎస్‌ఆర్‌డీపీ ద్వారా…
నగరంలో వివిధ రద్దీ జంక్షన్‌లో సిగల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను అమలు చేయడంతో పాటు వివిధ కారిడార్లలో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఫ్రీ లెఫ్ట్‌లను అమల్లోకి తీసుకొచ్చారు. వాహనదారులు నిర్ణీత సమయంలో గమ్యం స్థానానికి చేరడం మూలంగా వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి దోహద పడింది. ఎస్‌ఆర్‌డీపీ ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 48 పనులు చేపట్టారు. అందులో జీహెచ్‌ఎంసీ ద్వారా 42 పనులు, హెచ్‌ఎండీఏ, ఆర్‌ అండ్‌ బీ, జాతీయ రహదారులు ద్వారా 6 పనులు చేపట్టారు.
స్పోర్ట్స్‌ కాంప్లెక్‌
క్రీడాకారుల అవసరాల గుర్తించి క్రీడలకు అవసరమైన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం, ప్లే గ్రౌండ్‌లలో వసతుల కోసం రూ. 98.51 కోట్ల అంచనా వ్యయంతో 20 పనులు చేపట్టారు. అందులో ఇప్పటి వరకు రూ. 43.24 కోట్ల విలువ గల 10 పనులు పూర్తి కాగా రూ.50 17 కోట్ల విలువ గల 7మిగతా పనులు వివిధ అభివృద్ధిలో ఉన్నాయి.
నైట్‌ షెల్టర్లు
రాష్ట్రంలోని, వివిధ ప్రాంతాల నుండి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చే నిరుపేదలు, వారి సహాయకులుగా వచ్చే వారికి వసతి సౌకర్యం కల్పించేందుకు నైట్‌ షెల్టర్లను ఏర్పాటు చేశారు. 7ప్రధాన ఆస్పత్రుల్లో 862 మందికి వసతి కల్పించేందుకు రూ.10.68 కోట్ల అంచనా వ్యయంతో 7 నైట్‌ షెల్టర్‌ భవనాలు నిర్మించారు. అర్బన్‌ కమ్యూ నిటీ విభాగం ద్వారా మరో 13 నైట్‌ షెల్టర్లు కలవు.
చార్మినార్‌ పెడెస్టేరియన్‌ ప్రాజెక్టు
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో గుర్తింపు పొందిన చార్మినార్‌కు స్వచ్ఛ ఐకానిక్‌ 2018 అవార్డు దక్కిం ది. భారత దేశంలోని 20 చారిత్రక ప్రదేశాలలో హైదరా బాద్‌కు దక్కడం ఎంతో గర్వ కారణం. చార్మినార్‌ను తిలకిం చేందుకు వచ్చే పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేకంగా పెడెస్టేరియన్‌ ప్రాజెక్టును చేపట్టారు.
ఫిష్‌ మార్కెట్‌
జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 20కోట్ల వ్యయంతో 5 ఫిష్‌ మార్కెట్‌లను చేపట్టారు. అందులో రూ. 14.62 కోట్ల వ్యయంతో నాచారం, మల్లాపూర్‌, కూకట్‌ పల్లి, బేగంబజార్‌ లలో ఫిష్‌ మార్కెట్‌లను అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి.
భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపద
వారసత్వ సంపదను భవిష్యత్తు తరాల వారికి అందించే ఉద్ధ్దేశంతో హైదరాబాద్‌లో పురాతన చారిత్రిక భవనల అభివృద్దికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 3 పురాతన హెరిటేజ్‌ భవనాలను పునర్నిర్మాణం, పరి రక్షణ కోసం రూ. 18.33 కోట్ల అంచనా వ్యయంతో మొజాంజాహీ మార్కెట్‌, మౌలాలి కమాన్‌, క్లాక్‌ టవర్‌ పరి రక్షణ పనులను పూర్తి చేశారు.
మోడల్‌ మార్కెట్స్‌
రూ. 63.90కోట్ల అంచనా వ్యయంతో 3 మోడల్‌ మార్కెట్‌ భవనాల నిర్మాణాల పనులను చేపట్టాలని ప్రతిపా దించారు. అందులో నారాయణగూడ, చిక్కడపల్లి, అమీర్‌పే ట్‌తోపాటు పంజాగుట్ట మోడల్‌ మార్కెట్‌లు టెక్నికల్‌ మంజూరు దశలో కలవు.
రోడ్డు పనులు- బిల్డింగ్‌లు
ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులో తేవడానికి 55 రోడ్డు పనుల ను రూ.314.83కోట్ల వ్యయం తో చేపట్టారు. ఇదిలావుండగా రూ.38.58 కోట్ల వ్యయంతో 5 వివిధ రకాల భవనాల నిర్మాణాలను చేపట్టారు.
బ్రిడ్జి నిర్మాణం
మూసి నది పరివాహక ప్రాంత ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ అభివద్ధి కొరకు రూ.168 కోట్ల అంచనా వ్యయంతో 4 హై లెవెల్‌ బ్రిడ్జి లను చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో చాదర్‌ ఘాట్‌, అత్తాపూర్‌ ఇబ్రహీం బాగ్‌ వద్ద బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టనున్నారు. అందులో 3 పనులు టెండర్‌ దశలో ఉండగా ఒక పని డీ.పీ.ఆర్‌ స్టేజిలో కలదు. అశోక్‌ నగర్‌ వద్ద నాలా పై బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభం కానున్నయి.
కోట్ల విలువగల వివిధ అభివద్ది పనులు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు రూ.9,372.33 కోట్ల విలువ గల 77,546 వివిధ రకాల పనులను చేపట్టారు. అందులో రూ.45.97.58 కోట్లతో అంతర్గత రోడ్లైన సీసీ,వీడీసీసీ, బీటీ లాంటి 23750 పనులను పూర్తిచేస్తారు. రూ.936.37 కోట్ల వ్యయంతో 5,229 స్టార్మ్‌ వాటర్‌ పనుల పూర్తి చేశారు. రూ.3839 కోట్ల రూపాయల వ్యయంతో ఫెయిర్‌ అండ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా 48,567 వివిధ రకాల పనులను చేప ట్టారు. 2021-22 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2940 కోట్ల అంచనా వ్యయంతో 11,830 పనులు చేపట్టగా అందులో రూ.1441 కోట్ల విలువ గల 6996 పనులు పూర్తయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో 4567 పనులు చేపట్టగా ఇప్పటి వరకు రూ. 21.61 కోట్ల వ్యయంతో 101 పూర్తి కాగా మిగితా పనులు అభివృద్ది దశలో కలవు.
మోడల్‌ కారిడార్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచ నగర స్థాయిలో వసతి కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ విశేష కృషి చేస్తున్నది. ఈ నేపథ్యం ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పు గల రోడ్లలో ఈ మోడల్‌ కారిడార్లను చేపట్టనున్నారు. నగరవ్యాప్తంగా 29 మోడల్‌ కారిడార్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మొదటి దశలో రూ.52.72 కోట్ల అంచనా వ్యయంతో 15.54 పొడవు 16 పనులను మంజూరు చేశారు. అందులో 9 పనులు ప్రారంభం కాగా మరో ఐదు పనులు త్వరలో చేపట్టనున్నారు. మోడల్‌ కారిడా ర్‌లో పార్కింగ్‌, గ్రీనరీ, వెండింగ్‌ జోన్స్‌, సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. హబ్సిగూడ నుంచి నాగోల్‌ ఎల్బీనగర్‌ మీదుగా ఓవైసీ చౌరస్తా వరకు అక్కడ నుండి ఆరాంఘర్‌ వరకు ఎన్‌ఎండిసి నుండి షేక్‌ పేట్‌ మీదుగా గచ్చిబౌలి వరకు మోడల్‌ కారిడార్‌ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదిం చారు. అంతేకాకుండా ఖైరతాబాద్‌, శేర్లింగంపల్లి, కూకట్‌ పల్లి జోన్లలో పలు కారిడార్లను చేపట్టనున్నారు.
స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్లు
నగరవ్యాప్తంగా 1302 కి.మి పొడవు గల మురికి నీటి కాలువలను జీహెచ్‌ఎంసీ జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్లు నిర్మాణం, రీ-మోడలింగ్‌ సంభందించిన 968 పనులను రూ.533. 79కోట్ల వ్యయంతో చేపట్టగా అందులో రూ. 216.11కోట్ల వ్యయంతో 462 పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 320.83 కోట్ల విలువ గల 478 పనులు మంజూరు చేయగా అట్టి పనులు కొనసాగుతున్నాయి.
మల్టీ పర్సస్‌ ఫంక్షన్‌ హాల్‌
పేదలు, మధ్యతరగతి వారు సైతం తమ పిల్లల పెండ్లీ లు ఘనంగా జరిపించేందుకు మల్టీ పర్సస్‌ ఫంక్షన్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు. నామమాత్రపు రుసుం చెల్లించి ఫంక్షన్‌ హాల్‌ను బుక్‌ చేసుకోవచ్చు. మల్టీ ఫర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ 24 చేపట్టగా 9 ఫంక్షన్‌ హాల్‌ అందుబాటులోకి వచ్చాయి. మిగితా పనులు వివిధ ప్రగతి దశలో కలవు.
ఇంటిగ్రేటెడ్‌/ మోడల్‌ మార్కెట్‌
నగర వాసులు సుదూర ప్రాంతాలకు వెళ్లి అవసరమైన కావాల్సిన వస్తువులు ఇతర నిత్యావసర వస్తువులు కొనగోలు చేయకుండా తమ సమీపంలో 38 ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌లలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అందులో వినియోగదారులకు అవసరం గల మెడి కల్‌ షాప్‌లు, బ్యాంక్‌ ఏటిఎం, బేకరి, వెజిటబుల్‌, మాంసం, గ్రాసరి షాపులు ఏర్పాటు చేశారు.
ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి
కరోడ్డు దాటే సమ యంలో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ.76.65 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టగా 10పనులు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చాయి.
మోడల్‌ వైకుంఠ దామాలు
మానవుని చివరి మజిలీ సందర్భంగా దహన సంస్కారాలను కోసం వచ్చే బంధువులకు అన్ని వసతులను ఆధునిక పద్దతిలో వైకుంఠ దామాలను(గ్రేవ్‌ యార్డులను) నిర్మించారు. ఆధునిక వసతులతో కూడిన వైకుంఠ దామాల్లో ప్రహరీ గోడల నిర్మాణంతో పాటుగా నీటి వసతి, బాత్‌ రూం, టాయిలెట్‌, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39 వైకుంఠ దామాలను చేపట్టగా 29 పనులు పూర్తి కాగా మిగితా వాటి పనులు అభివద్ధి దశలో ఉన్నాయి.
వరద ముంపు నివారణపై ప్రత్యేక దృష్టి
వరద ముంపు నివారణకు శాశ్వతంగా పరిష్కరిం చేందుకు తెలంగాణ ప్రభుత్వం కషి మేరక వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వరద ముంపు నివారణ కోసం రూ.985.45 కోట్ల అంచనా వ్యయంతో 57 పనులు మంజూరు చేశారు. వర్షాకాలంలో వరద వలన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసితులకు సమస్య లేకుండా చేశారు.
టౌన్‌ ప్లానింగ్‌
నూతన ఇండ్ల నిర్మాణం ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో అనుమతులు పారదర్శకంగా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం టి.ఎస్‌.బి పాస్‌ అమలు చేస్తున్నది. ఈ సంవత్సరంలో 75 గజాల లోపు ఇండ్ల నిర్మాణ ఇన్స్టెంట్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా 1535 అనుమతులను చేశారు. 75 గజాల నుండి 600గజాల లోపు జి ప్లస్‌ 2 నిర్మాణానికి ఇన్‌ స్టెంట్‌ అప్రూవల్‌ ద్వారా 22,408 తక్షణమే అనుమతులు జారీ చేశారు. 600 గజాలు పై బడిన 10 మీటర్ల ఎత్తు గల భవన నిర్మాణాలకు సింగిల్‌ విండో ద్వారా 4465 అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇన్‌ స్టంట్‌ అప్రూవల్‌ ద్వారా 1673 ఓసి లను జారీ చేశారు. సింగిల్‌ విండో ద్వారా 3026 ఓసి లు జారీ చేశారు. 31 లే అవుట్‌ లకు భవన నిర్మాణాలకు అనుమతించారు. మొత్తం వివిధ రకాల ఇళ్ల నిర్మాణాల కోసం 35,778 దరఖాస్తులు రాగా అందులో 24, 817 మందికి మాత్రమే అనుమతులు జారీ చేశారు.
బస్తీ దావాఖానాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భాగస్వామ్యం, సహకారంతో నగరంలో ప్రజా ఆరోగ్యం కోసం జీహెచ్‌ఎంసీ విశేష కషి చేస్తున్నది. వివిధ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు ఎలాంటి రుసుము లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు. అందులో భాగంగా నగరంలో వార్డుకు రెండు చోపున బస్తీ దవాఖానలు ఏర్పాటుకు చర్యలు తీసుకోగా ఇప్పటి వరకు 286 అందుబాటులోకి వచ్చాయి. అందులో 1,కోటి, 70లక్షల 44వేల 671 మందికి ఆరోగ్య పరీక్షలు, వివిధ సేవలు అందించారు. బస్తీ దవాఖానలో షుగర్‌, బిపి, ఎక్స్‌ రే, సుమారు 57 వ్యాధులకు సంబం ధించిన పరీక్షలు, ఉచితంగా సేవలు అందించడం మూలం గా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందని చెప్పవచ్చు.

 

Spread the love