నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నకల పరిణామాలు, అల్లర్ల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ మూడు జిల్లాల ఎస్పీ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీనిపై అర్హుల జాబితా పంపాలని ఈసీ… ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ పంపింది అయితే, ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరంటూ సీఎస్ జవహర్ రెడ్డి మూడు పోస్టులకు కేవలం ఐదుగురి పేర్లను మాత్రమే పంపారు. దీనిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి సీఎస్ కు లేఖ రాసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు చొప్పున తొమ్మిది మంది పేర్లు పంపాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.