హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌.. కలకలం

నవతెలంగాణ హైదరాబాద్‌: హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి భారీగా డ్రగ్స్‌ (drugs) పట్టుబడ్డాయి. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు సీజ్‌చేశారు. దొంగచాటుగా డ్రగ్స్‌ తరలిస్తున్న ఎడుగురిని అరెస్టు చేశారు. వారివద్ద 1.5 కిలోల ఓపీఎం డ్రగ్‌, 24 గ్రాముల హెరాయిన్‌, 5 కిలోల పోపీస్ట్రా ను స్వాధీనం చేసుకున్నారు. ఒక కంటైనర్‌, ఎనిమిది మోటార్‌ సైకిళ్లు, 8 మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. వాటిని బీహార్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లుగా గుర్తించామన్నారు. వాటి విలువ రూ.2.15 కోట్లు ఉంటుందని చెప్పారు. సిగరెట్లతోపాటు డిటర్జెంట్‌ పౌడర్‌ను సీజ్‌ చేశామన్నారు. నింధితులు ఇలియాసుద్దీన్‌, రవికాంత్‌ కుమార్‌, ఎండీ షహజాద్‌, ముబారిక్‌ ఖాన్‌ను అరెస్టు చేశామని, రెహన్‌ ఖాన్‌, సుభాష్‌ పరారయ్యారని చెప్పారు.

Spread the love