టీఎస్‌పీఎస్సీ కేసు..మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం: సిట్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు తాజా వివరాలను ప్రత్యేక దర్యాప్తు బృందం అదనపు కమిషనర్‌ రంగనాథ్‌ మీడియాకు వివరించారు. కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు 109 మందిని అరెస్టు చేశాం. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశముంది. కమిషన్‌ కస్టోడియన్‌ శంకరలక్ష్మిని గతంలోనే విచారించాం. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉందనేది తేలాల్సి ఉంది. కొన్ని మిస్సింగ్‌ లింక్స్‌ ఉన్నాయి. మా సిబ్బంది వాటిని తేల్చే పనిలో ఉన్నారు. త్వరలోనే మీడియాకు మరిన్ని విషయాలు వెల్లడిస్తాం’’ అని రంగనాథ్‌ తెలిపారు.

Spread the love