ఎయిడ్స్ వ్యాధికి నివారణయే మార్గం.. మందులేదు

– ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు..నివారణయే మార్గమని మండల వైద్యాధికారి రాజు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రములో ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మందులతో కొద్దిరోజులు బతకడం తప్పా ఎయిడ్స్ కు పూర్తి నివారణ లేదన్నారు. నాగరిక సమాజంలో జీవిస్తున్న మనుషులుగా మనందరం కలిసి విచ్చలవిడి శృంగారాన్ని, అక్రమ సంబంధాలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్ వ్యాధి సోకినా వారి వివరాలను గోప్యంగా ఉంచాలని. వారికి కావలిసిన మందులను అందిచాలని సూచించారు.  ఎయిడ్స్ వ్యాధిని రూపుమాపడంలో నిరంతరం సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, స్వచ్చంధ సంస్థల సేవలు గొప్పయన్నారు.
Spread the love