పాతబస్తీలో మెట్రో రైల్‌ నిర్మాణానికి అభ్యంతరం లేదు..

– సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ కార్యదర్శి ఎం.డి.అబ్బాస్‌
నవతెలంగాణ-ధూల్‌పేట్‌
హైదరాబాద్‌లోని పాతబస్తీలో మెట్రో రైల్‌ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ కార్యదర్శి ఎం.డి.అబ్బాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతబస్తీలో మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సన్నాహక పనులు ప్రారంభించడాన్ని సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆహ్వానిస్తోందన్నారు. ఓల్డ్‌ సిటీ పరిధిలో రవాణా సౌకర్యాలు లేక, మరోవైపు పెరుగుతున్న ట్రాఫిక్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐదారేండ్లుగా తవ్రగా మెట్రో రైలు పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశామని గుర్తు చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మధ్యలో 5.5 కిలో మీటర్ల బ్యాలెన్స్‌ మెట్రో అలైన్‌మెంట్‌ వెంటనే పూర్తిచేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని పేర్కొన్నారు.. ఎంజీబీఎస్‌ నుంచి దారుల్షిఫా జంక్షన్‌ – పురానీ హవేలీ – ఇత్తెబార్‌ చౌక్‌ – అలీజాకోట్ల – మీర్‌ మోమిన్‌ దర్గా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్‌, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు మెట్రో అలైన్మెంట్‌ పనులు ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Spread the love