– ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.శివకుమార్
నవతెలంగాణ-తుర్కయంజాల్
నీట్ పరీక్ష ఫలితాల విషయంలో వస్తున్న అనుమానాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.శివకుమార్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకటిం చిన నీట్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగా యని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆరుగురు వి ద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం, వారి పరీక్షా కేంద్రం ఒకటే కావడం వల్ల అనుమానాలకు బలాన్నిస్తుందన్నారు. కాబట్టి తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పం దించి పరీక్ష రాసిన మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన కూడా వారి మాటని పెడచెవిన పెట్టి, నిర్లక్ష్యం చేయడం ద్వారా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.