– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఎన్నికల కౌంటింగ్ నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరుగకుండా కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు జాగ్రత్తగా పని చే యాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళ వారం ఐడీఓసీ సమావేశ హాల్‌లో కౌంటింగ్ రోజున చేపట్టే విధివిధా నాలపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు.. కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అన్నారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు విధులు నిర్వహించాలని సూచించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల అధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ టీం వారిగా చేయాల్సి ఉంటుందని, ఆర్‌ఓల దగ్గర ఆర్డర్ కాపీ, ఐడీ కార్డు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ రోజున ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ చేయాలని, తదుపరి 08:30 గంటలకు ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం చేయాలని తెలిపారు. ప్రతి రౌండ్‌కూ రిజల్ట్ షీట్‌లో రాసి రిసల్ట్స్ ఇవ్వాలని అన్నారు. కౌంటింగ్ సూ పర్‌వైజర్లు కంట్రోల్ యూనిట్ ఆయా పోలింగ్ స్టేషన్‌లకు సంబంధిం చినదా కాదా అని చెక్ చేసుకోవాలని తెలిపారు. ప్రతీ టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లో కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేసి, కంట్రోల్ యూనిట్‌లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సి నందు నమోదైన ఓట్లు సరి చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలకు చోటు లేకుండా ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్స్ రాంరెడ్డి, వీర కాంతం, సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.