చిచ్చా సందడి షురూ…

‘భగవంత్‌ కేసరి’ మేకర్స్‌ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌ గణేష్‌ సాంగ్‌ ప్రోమోతో అలరించారు. శుక్రవారం పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. గణేష్‌ చతుర్థిని సెలబ్రేట్‌ చేసుకుంటూ బాబారు, అమ్మాయిగా బాలకష్ణ , శ్రీలీల ఈ పాటలో సందడి చేశారు.ఈ పాట కోసం తమన్‌ పెప్పీ, మాస్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేశారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్‌ రాసిన సాహిత్యం, కరేముల్లా, మనీషా పాండ్రంకి హై-పిచ్డ్‌ వోకల్స్‌తో ఎనర్జిటిక్‌గా ఆలపించిన తీరు సైతం పాటని మళ్ళీ మళ్ళీ వినాలపించేలా ఉండటం విశేషం. అలాగే బాలకష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌లు, గెటప్‌లు, డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ బ్రిలి యంట్‌గా ఉంది. కాజల్‌ అగర్వాల్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల చేయబోతున్నారు.

Spread the love