తెలంగాణలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 195 స్థానాలకుగానూ పోటీదారుల పేర్లు ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మందిని అధిష్ఠానం ఎంపిక చేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్థానాల్లో గెలుపొందగా.. అందులో ముగ్గురు సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. ఆదిలాబాద్‌ నుంచి సోయం బాపూరావుకు తొలిజాబితాలో అవకాశం లభించలేదు.
సికింద్రాబాద్‌ – కిషన్‌రెడ్డి (కేంద్రమంత్రి)
కరీంనగర్‌ – బండి సంజయ్‌
నిజామాబాద్‌ : డి.అర్వింద్‌
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మల్కాజిగిరి – ఈటల రాజేందర్‌
జహీరాబాద్‌ – బీబీ పాటిల్‌
హైదరాబాద్‌ – మాధవీలత
నాగర్‌ కర్నూల్‌ – భరత్‌ ప్రసాద్‌
భువనగిరి – బూర నర్సయ్యగౌడ్‌

Spread the love